ఈనాడు, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)తో సగటు, మధ్య తరగతి ప్రజలకు పన్నుల భారం నుంచి కొంత వూరట లభించనుంది. ఒక సామాన్య కుటుంబం నెలసరి వ్యయంపై సుమారు రూ.500కు పైగా మిగులుతుందని అంచనా. కొన్ని నిత్యావసర సరకులు, ఆహార పదార్థాలపై పన్నును పూర్తిగా తొలగించడం లేదా తగ్గించడంతో కొంత ఉపశమనం లభించింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బియ్యంపై ఐదు శాతం పన్ను రద్దు కానుండడంతో ప్రతి కుటుంబానికి రూ.60 నుంచి రూ.100 దాకా మిగిలే అవకాశం ఉంది. టీ, కాఫీ, మసాలాలు, సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, మందులు సహా వివిధ తినుబండారాలు, ఆహారపదార్థాల పన్నులు తగ్గడంతో సామాన్య కుటుంబాలకు పన్నుల భారం కొంతమేర తగ్గినట్లే. ఓ కుటుంబం ఆహారపదార్థాలు, కిరాణా సరకులకు గతంలో సగటున నెలకు రూ.11667 వ్యయం చేస్తుండగా జీఎస్టీ నేపథ్యంలో ఇది రూ.11169 కానుంది. కింద పేర్కొన్న వస్తువుల్లో పన్ను మార్పుల వల్ల సుమారు రూ.500 ఆదా కానుంది.

Comments

Post a Comment

Popular posts from this blog

GST helpline number / GST Customer Care Number

The list of GST Suvidha Provider (GSP)

details about GST rates for services